ఆ ఒక్క నాణెం ఖరీదు 9 కోట్లు…ప్రత్యేకత తెలిస్తే షాకే…!!!

-

ఒక నాణెం ఖరీదు 9 కోట్లా అంటూ నోళ్ళు వెళ్ళబెట్టకండి. ప్రతీ పురాతన వస్తువు ఎంతో అమూల్యమైనది. పూర్వకాలంనాటి పురాతన వస్తువులు వేలం వేసినపుడు మాత్రమే వాటి యొక్క అసలు  విలువ తెలుస్తుంది. ఇలాంటి ఘటనే లండన్ లోచోటుచేసుకుంది. నాణమే కదా అనుకున్నారు, కానీ ఆ నాణాన్ని వేలంలో పెట్టడంతో కోట్లు కుమ్మరించేలా చేసింది. అసలు విషయంలోకి వెళ్తే..

ఆ నాణెం సుమారు 80 ఏళ్ళ  క్రితం నాటిది. అంతేకాదు దీని ప్రత్యేకత ఏమిటంటే  ఈ నాణం  పైన బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ బొమ్మ కూడా ముద్రించి ఉంటుంది. ఇలాంటి నాణాలు ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా ఉన్నాయని అందుకే ఈ నాణం వేలానికి పెట్టగానే డబ్బుని లెక్కచేయకుండా కొన్నామని అన్నారు పేరు కూడా బయటకి చెప్పడానికి ఇష్టం లేని ఓ వ్యక్తి..

 

1936 కింగ్ ఎడ్వర్డ్ అమెరికన్ మహిళ విల్లిస్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు గాను పెద్దలు ఎవరూ ఒప్పుకోకపోవడంతో అతడు ఏకంగా తన రాజ సింహాసనాన్ని వదులుకోవాలని భావించాడట, అప్పట్లోనే ఈ విషయం పెద్ద ప్రాచుర్యం పొందటంతో పాటు ఆ కాలానికి చెందిన నాణెం కావడంతో దీనికి అంతటి విలువ ఉన్నదనేది పరిశీలకుల అంచనా…

 

Read more RELATED
Recommended to you

Latest news