ఆర్థిక సమస్యలు పోవాలంటే ఇలా చేయండి !

-

ధనం.. ధనం.. అందరికీ అవసరమే. నిత్యం గడువాలంటే డబ్బు ముఖ్యం. అయితే ఆ డబ్బుకు సంబంధించి పలు సమస్యలు. చాలామందికి ఎంత కష్టపడ్డా ఆర్ధిక సమస్యలు తీరవు. వాటికి రకరకాలకారణాలు వుండవచ్చు. అయితే భగవదునగ్రహం ఉంటే తప్పక సంపదలు మీ సొంతం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతారు. ఎందరో ఈ కింది పరిహారాలు పాటించి ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు.. పండితులు చెప్పిన ఆ విశేషాలు తెలుసుకుందాం…

కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు.. ఏవేవో కారణాతో వచ్చిన డబ్బు వచ్చినట్లు వెళ్లిపోతుంటుంది. అలాంటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే వాటిని పరిహారం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా.. కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నిత్యం ఇంట్లో దీపారాధన, సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం చేయాలి. ప్రతి శుక్రవారం గడపలకు పసుపు పూయడం, అలంకరణ, తులసీ దగ్గర దీపారాధన చేయడం చేయాలి. అలాగే దగ్గర్లోని ఏదేని గుడిని రోజూ శుభ్రం చేసి ముగ్గుపెట్టాలి.

ఆలయ ప్రాంగణంలో పూలమొక్కలు, అరటి మొక్కలు నాటాలి. స్థలం చిన్నదైతే పూలమొక్కలు నాటినా పర్లేదు.. రోజూవాటికి నీరు పోస్తూ మొదటిగా పూచే పూలు, కాచే పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా గోసేవ, చాతనైనంతలో పేదలకు ఆహారం అందించడం, రోగులకు, వికలాంగులకు సహాయం అందించడం చేయాలి. ఎల్లపుడు మంచి ఆలోచనలతోఉండాలి. ఎదుటివారి అభ్యున్నతిని చూసి ఈర్ష్య పడకూడదు. అందరూ బాగుపడాలనే ఆలోచన ఉండాలి. అంతేకాకుండా నిత్యం లక్ష్మీ, విష్ణు ఆరాధన, ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం ఐశ్వర్య ప్రదాయకం. శివారాధన ఐశ్యర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీగణపతి ఆరాధన చేయడం మంచిది. ఇవేకాకుండా లక్ష్మీదేవిని ఎర్రటి పూలు, గులాబీలతో ఆరాధించడం చేయాలి. వీలైతే శుక్రవారం ఆవునెయ్యితో దీపారాధన చేయడం చేస్తే తప్పక ఏడాదిలోపే మీ సమస్యలు అన్ని పటాపంచలు అవుతాయని పండితులు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news