తెలంగాణ సోయగం ఈషా రెబ్బ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. 34 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలుగింటి సోయగం..ఇంకా చెప్పాలంటే తెలంగాణ సోయగం ఈషా రెబ్బ ఇవాళ తనని తాను నిరూపించుకోవాలని పరితపిస్తోంది.
ఆ విధంగా అవకాశాలను వెతుక్కుంటోంది. ఆమెకు తెలుగుతో పాటు చాలా తెలుసు .. కొందరికి తెలుగు తెలియదు కానీ చాలా తెలుసు అన్న నమ్మకమో, పొగరో ఉన్నాయి. కొన్ని సినిమాల్లో నటించాక ఆమె విశ్వాసం గెలిచింది.
ఆత్మ విశ్వాసం రెట్టింపు అయింది.ఇంకా కెరియర్ బ్రేక్ రావడం ఒక్కటే మిగిలి ఉంది. ఏదేమయినా వన్ ఫిల్మ్ వండర్ -అన్న విధంగా తన కెరియర్ ఉండకూడదనే అనుకుంటోంది.
అందుకు తగ్గ విభిన్నతను పాటించేందుకు ప్రయత్నిస్తోంది. అన్నీ ఫలిస్తే టాలీవుడ్ వెబ్ సిరీస్ లకు ఆమె బెస్ట్ ఛాయిస్.బాలీవుడ్ భామలను కూడా పక్కకు తోసేసి నటించే దమ్మున్న భామ. అలాగే సోషల్ మీడియా లోను హాట్ ఫోటోలు పెట్టి.. అందరినీ రెచ్చగొడుతోంది.