సీఎం ని కలవడానికి చూస్తున్నా… కలవలేదు: ఈటెల

మంత్రి ఈటెల రాజేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీకి ఓనర్లమూ మేమే అంటూ నేను బజాప్త వ్యాఖ్యలు చేసిన అని ఆయన స్పష్టం చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా నాపై బురద జల్లే బదులు నన్ను పిలిచి అడిగితే సంతోషించేవాన్ని అన్నారు. ముఖ్యమంత్రి ని , కేటీఆర్ ను కలిసేందుకు మూడు రోజుల నుండి ప్రయత్నం చేస్తున్న నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని ఆరోపణలు చేశారు.etala-rajender

నాపై ఆరోపణలకు సంబంధించిన కథనాలు ఆగడం లేదు అని మండిపడ్డారు. మా ప్రతీకలు , మా చానెళ్లు నాపై వరుస కథనాలు ప్రచురించడం బాధ కలిగించాయి అన్నారు. అయిన ఈటెల అదరడు , బెదరడు అన్నారు. ప్రభుత్వం వేసిన విచారణ కమిటీ రిపోర్ట్ వచ్చాక నా భవిష్యత్తు నిర్ణయం పై ఆలోచిస్తా అని వ్యాఖ్యానించారు.