ఈటెల రాజకీయాల్లోకి రాకముందే వందల ఎకరాలు ఉన్నాయి: తెరాస నేతలు

తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఆయనకు సంబంధించిన అవినీతి ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయనపై వస్తున్న ఆరోపణలపై హుజురాబాద్ తెరాస నేతలు స్పందించారు. మంత్రి ఈటెల.. కష్టపడి వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు అని చెప్పారు.

మొదటి నుండి కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈటెల అని తెలిపారు. రాజకీయాల్లోకి రాక ముందే వందల ఎకరాల భూములు, ఆస్తులు, కోళ్ల ఫామ్ లు ఉన్నాయి అని అన్నారు. కావాలనే ముఖ్యమంత్రి, కేసీఆర్ కుటుంబం ఈటెల పై నిందలు మోపుతుంది అని మండిపడ్డారు. ఈటెలపై మోపిన నిందలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేసారు.