ఇది మామూలు గుడ్డే.. కానీ చరిత్రకెక్కింది.. ఎందుకో తెలుసా?

-

Egg gang record most liked post in instagram

అవును.. మీరు పైన చూస్తున్న గుడ్డు మామూలుదే. సాధారణంగా మనం రోజూ చూసే గుడ్లలో అది కూడా ఒకటి. దాంట్లో ఎటువంటి స్పెషాలిటీ లేదు. కానీ.. అది ఇప్పుడు రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎలా అంటారా? అదే ఇంట్రెస్టింగ్ ఇక్కడ.

దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఈ గుడ్డుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 51,344,368 లైకులు వచ్చాయి. అంటే 5 కోట్ల 13 లక్షల చిల్లర లైకులు వచ్చాయి. అదే ఈ గుడ్డు ప్రత్యేకత. ఇంతవరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పోస్టుకు ఇన్ని లైక్స్ రాలేదు. అంతకుముందు మాత్రం కైలీ జెన్నర్ అనే ఓ అకౌంట్‌లోని పోస్టుకు కోటీ 80 లక్షల లైకులు వచ్చాయి. ఆ రికార్డును ఈ గుడ్డు తృణప్రాయంగా చెడిపేసింది. వరల్డ్ రికార్డు ఎగ్ అనే పేరుతో ఉన్న అకౌంట్‌లోనే ఈ గుడ్డు ఫోటోను పోస్ట్ చేశారు. ఫోటోను పోస్ట్ చేయడంతో పాటుగా… ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పోస్ట్‌గా రికార్డు క్రియేట్ చేద్దాం. ప్రస్తుతం ఉన్న కైలీ జెన్నర్ రికార్డును చెరిపేద్దాం.. అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? రెచ్చిపోయారు. లైకుల మీద లైకుల వర్షం కురిపించేసరికి.. కైలీ జెన్నర్ రికార్డు నిమిషాల్లో చెరిగిపోయింది. అమ్మ.. ఇంత పనికి వస్తారా? అని అలాగే ఉన్న ఓ గుడ్డును పలగ్గొట్టి.. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది కైలీ.

 

View this post on Instagram

 

Take that little egg

A post shared by Kylie (@kyliejenner) on

Read more RELATED
Recommended to you

Latest news