ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఇప్పుడు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. దీనితో నాయకులూ సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దమయ్యారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆయన నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వారి అవసరాలను చూడాలని సూచించారు.
ప్రజల కష్టం, నష్టం పంచుకోవాలని, విపత్తుల్లోనే ప్రజలకు అండగా ఉండాలని ఆయన కోరారు. పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే కరోనా పెరిగిందన్నారు చంద్రబాబు. వసతులు లేక క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధి పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు.
కోడిగుడ్లు, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేయాలని నేతలకు సూచించడమే కాకుండా ప్రభుత్వం దృష్టికి, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పిడుగుపాటుకు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన కోరారు. ఢిల్లీలో క్వారంటైన్ పూర్తయిన తెలుగు విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు చంద్రబాబు.