ఫ్లాపుల్లో ఉన్న నాని కి 2020 కలిసొస్తుందనుకుంటే కరోనా కాటేసింది పాపం ..!

-

నేచురల్ స్టార్ నాని భారీ సక్సస్ ని అందుకొని చాలా కాలమైంది. 2019 లో జెర్సీ లాంటి క్లాసిక్ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలనుకున్నాడు. అయితే ఆ సినిమా నాని ఆశలని ఆవిరి చేసింది. ప్రేక్షకులకు నచ్చింది. విమర్శకుల ప్రశంసలని దక్కించుకుంది. కాని ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సస్ అందుకోలేకపోయింది. మేకర్స్ అనుకున్న లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ తర్వాత విక్రం కుమార్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రయోగం చేశాడు. కాని ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.

 

అయితే బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ అవుతుండటం విశేషం. ఇక 2020 లో నాని తన 25వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏ హీరో అయినా 25వ సినిమా అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. తన నేచురల్ యాక్టింగ్ కి హీరోయిజం హై రేంజ్ లో ఉండాలనుకుంటాడు. కానీ అందుకు భిన్నంగా ఆలోచించాడు. తన 25వ సినిమాలో విలన్ గా నటించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘వి’ సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కాని ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక నాని తన 26 వ సినిమా ‘టక్ జగదీష్’. నిన్ను కోరి, మజిలీ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో ముగ్గురు అన్నదమ్ముల మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూపిస్తూ దర్శకుడు శివ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. అయితే ఇప్పుడు నానీ ప్లాన్స్ అన్ని తారుమారు అయిపోయాయి. మొత్తం 2020 లో మూడు సినిమాలతో హిట్స్ కొట్టాలన్న తాపత్రయంతో ట్యాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్ సంక్రిత్యన్ తోను ఒక సినిమా కమిటయ్యాడు. ఈ సినిమాని 2020 ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తేవాలనుకున్న ప్లాన్స్ కి బ్రేక్ పడిందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news