ఈనెల 4న ఎన్నికల కౌంటింగ్ కు వెళ్లే రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఆల్కహాల్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ హాల్ లోకి వెళ్లే ముందుగా వారికి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేయనున్నట్లు సమాచారం.
ఆ టెస్ట్ లో మద్యం తాగినట్టు తేలితే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించకుండా వెనక్కి తిరిగి పంపుతారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు పోలీసుల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ గా మారాయి.
కాగా, లోక్ సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు 8 రాష్ట్రాలు, ఒక UTతో కలిపి మొత్తం 57 స్థానాల్లో జరగనుంది. నరేంద్ర మోడీ, అనురాగ్ ఠాకూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులతో సహా మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత సాయంత్రం 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడనున్నాయి. వాటి కోసం రాజకీయ నేతలతో పాటు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.