రైతులకు అలర్ట్..రుణమాఫీపై రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్దవ్ సర్కార్ రూ. 2 లక్షల లోపు ఉన్న పంట రుణాలను షరతులేవి విధించకుండా మాఫీ చేసింది. ఒకేసారి రూ. 20 వేల కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది.
ఆ సొమ్మును లోన్ పేమెంట్ కింద బ్యాంకులు జమ చేసుకున్నాయి. తెలంగాణ వ్యవసాయ ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఎంహెచ్ లో ఈ విధానాన్ని అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
కాళేశ్వరంలో మూడు బ్యారేజీల పనులు…కొనసాగుతున్నాయి. మూడు బ్యారేజీలలో కలిపి మొత్తం 57 సీకెండ్ పనులు చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేడిగడ్డలో ప్రస్తుతం 7 టెస్టులు, పనులు సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ 30వ తేదీ లోపు టెస్టులు ఇతర పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం.