కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం… ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతిపై నేడు నిర్ణయం.

-

కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రోడ్ షోలు, ర్యాలీలపై నిర్ణయం తీసుకోనుంది. అయితే గతంలో జరిగిన సమావేశంలో రోడ్ షోలు, ర్యాలీలపై ఈనెల 31 వరకు నిషేధం విధించాయి. తాజాగా ఈరోజు సీఈసీ సుశీల్ చంద్ర, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిని కలవనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు మరియు ప్రధాన కార్యదర్శులతో కూడా కేంద్ర ఎన్నికల సంఘం వర్చువల్‌గా సమావేశమవుతుంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓమిక్రాన్, కరోనా వ్యాప్తి పెరగడంతో కేంద్ర ఎన్నికల సంఘం ర్యాలీలు, రోడ్ షోల పై నిషేధం విధించాయి. అయితే కరోనా తగ్గుతున్న నేపథ్యంలో ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను జనవరి 8 న ప్రకటించిన ఈసీ, ఎన్నికల ప్రచార సభలను, రోడ్ షో లను, ఇతర ఎన్నికల ప్రచారాలను జనవరి 15 వ తేదీ వరకు నిషేధించింది. ఆ తరువాత దీన్ని 22 తేదీకి పొడగించింది. మళ్లీ సమావేశం అయిన ఈసీ ఈ నిషేధాన్ని ఈనెల 31 వరకు పొడగించింది. అయితే, రాజకీయ పార్టీలు ఇండోర్ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాత్రం అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఏదైనా సమావేశ మందిరంలో 300 మంది వరకు హాజరయ్యేందుకు, లేదా సమావేశ మందిరం సామర్ధ్యం లో 50 శాతం వరకు సమావేశమయ్యేందుకు అనుమతించిన కేంద్ర ఎన్నికల సంఘం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news