ఎన్నికల్లో పోటీ చేయడానికి వయస్సు ను 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలన్నారు. ఎల్బీ స్టేడియంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల నిబంధనను 21కి తగ్గించాలన్నారు. 21 ఏళ్లు నిండిన వాళ్లు ఐఏఎస్, ఐపీఎస్ లుగా పని చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా రాణిస్తారని తాను బలంగా విశ్వసిస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎన్నికల్లో శాసనసభ కు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్లు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే.. కొత్త జనరేషన్, రాజకీయాల్లో రాణించేందుకు యువతకు అవకాశం వస్తుందని తెలిపారు. స్పీకర్ తీర్మాణం చేసి భారత దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రికి ఈ తీర్మాణాన్ని పంపవలసిందిగా స్పీకర్ కి విజ్ఞప్తి చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.