పేదల కడుపు కొట్టబోతున్న మోదీ సర్కార్..ఆ పథకాలకు మంగళం..

-

మోదీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు.అందులో కొన్ని ప్రజల లబ్ది చేకూరిస్తే మరి కొన్ని మాత్రం ఎగనామం పెడుతున్నాయి..ఇప్పుడు మరొక షాక్ ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది.ఇప్పటి వరకు ఇస్తోన్న ఉచిత రేషన్‌కు ఇకపై మంగళం పాడనున్నట్లు వార్తలు చక్కర్లు కోడుతున్నాయి.ఈ విషయం పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆర్థిక, ఆహార భద్రత సమస్యల కారణంగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేది ఉచిత రేషన్ పంపిణీ పథకం. కరోనా వ్యాప్తి మొదటి వేవ్ నేపథ్యంలో మార్చి 2020లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద 80 కోట్ల మంది పౌరులకు ప్రతి నెలా ఐదు కిలోల ఉచిత రేషన్‌ను అందిస్తున్నారు.. ఇబ్బందులు పడుతోన్న పౌరులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ పథకం అనేక సందర్భాల్లో పొడిగించుకుంటూ వచ్చారు.
తాజాగా సెప్టెంబర్ వరకు కేంద్రం ఈ పథకాన్ని పొడిగించింది..భారీ సబ్సిడీ పెంపు/పన్ను తగ్గింపులు చేయకపోవడం చాలా ముఖ్యం అంటూ కేంద్ర ప్రభుత్వానాకి ఆర్థిక శాఖ ఒక లేక రాసింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో 2022-’23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆర్థిక లోటు – ఆదాయాలు, వ్యయాల మధ్య వ్యత్యాసం దేశ జీడీపీలో 6.4%కి కోట్ చేశారు. ఇలా చేసుకుంటూ పోతే ఆర్థిక నష్టం పెరుగుతుందని భావించారు.

ఉచిత రేషన్‌ పంపిణీ పథకంతో పాటు ఎరువుల సబ్సిడీ పెంపు, వంటగ్యాస్‌పై సబ్సిడీ, పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, ఎడిబుల్‌ ఆయిల్స్‌పై కస్టమ్స్‌ సుంకం తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్థిక శాక తర్జనభర్జనలు పడుతోంది. ఇది తీవ్రమైన ఆర్థిక పరిస్థితికి దారి తీయోచ్చని హెచ్చరించింది..ప్రస్తుతం సబ్సిడీ కిందవస్తున్న అన్నీ పథకాలకు ఒక్కోటిగా మంగళం పాడనున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news