అన్ని అంశాలను పక్కదారి పట్టించి ప్రజలను మభ్యపెట్టడంలో మోడీ పండితుడు: రాహుల్ గాంధీ

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం ఆయన ప్రజలను మభ్య పెట్టేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో తీరికలేకుండా ఉన్నారని చెప్పారు.” అన్ని అంశాలను పక్కదారి పట్టించి ప్రజలను మభ్యపెట్టడం లో మోడీ పండితుడు..

అయితే ఈ విపత్తులను మాత్రం ఆయన దాచిపెట్ట లేరు. అవి ఏంటంటే.. డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ. 78 కి చేరింది. ఎల్ఐసి మార్కెట్ విలువలో రూ. 1.32 లక్షల కోట్లు నష్టపోయింది. హోల్ సేల్ ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరింది. నిరుద్యోగం జీవితకాల గరిష్టానికి చేరింది. దేశంలో ఎన్నడూ జరగనంత అతిపెద్ద బ్యాంకు కుంభకోణం డిహెచ్ఎఫ్ఎల్ లో చోటుచేసుకుందని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా ద్వారా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news