ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లతో.. ట్విటర్​లో ఎలాన్ మస్క్ రికార్డ్

-

ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మరో ఘనత సొంతం చేసుకున్నారు. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్​లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. ట్విటర్​లో మస్క్​కు 133 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ రికార్డుతో మస్క్.. ఇప్పటి వరకు అత్యధిక ఫాలోవర్లు కలిగిన వ్యక్తిగా కొనసాగుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను అధిగమించారు. ఆయన్ను వెనక్కి నెట్టి మస్క్ అగ్రస్థానానికి ఎగబాకారు.

ట్విటర్​లో అత్యధికమంది ఫాలోవర్లు కలిగిన రికార్డు 2020 నుంచి ఒబామా పేరుపైనే ఉంది. ఇప్పుడది ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం గతేడాది అక్టోబరు 27న మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పుడు ఆయన ఫాలోవర్ల సంఖ్య 110 మిలియన్లుగా ఉంది.

అనంతరం ఐదు నెలల్లోనే ఆ సంఖ్య 133 మిలియన్లకు చేరుకోవడం విశేషం. అంటే సగటున రోజుకు లక్షమంది ఫాలోవర్లు వచ్చి చేరుతున్నారు. ప్రస్తుతం ట్విటర్ ప్రొఫైల్స్ సూచించిన ఫాలోవర్స్ ప్రకారం.. ఒబామాకు 1,33,042,819 మంది ఫాలోవర్స్ ఉండగా, మస్క్ ఫాలోవర్స్ సంఖ్య 133,068,709 మందిగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news