ఏలూరు ఘటనపై 21 మంది సభ్యులతో హైపవర్‌ కమిటీ..

-

ఏలూరు ఘటనపై ప్రభుత్వం  హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. వింత వ్యాధి మీద కారణాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశారు. 21 మంది సభ్యులతో హైపవర్ కమిటీ వేయగా ఈ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ పని చేయనున్నారు. కన్వీనర్ గా ఆరోగ్య శాఖ ప్రినిపల్స్ సెక్రెటరీ వ్యవహరించనున్నారు. నివారణ చర్యలు కూడా సూచించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

eluru
eluru

పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఇక ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. ఇక ఈ వింత వ్యాధికి తాగునీరే కారణమని అనుమానాలు బలపడుతున్నాయి. తాగునీటిలో మిథైన్ డై క్లోరైడ్ (డీపీయం) ఉన్నట్లుగా ఒక సంస్థ గుర్తించినట్టు చెబుతున్నారు. పరిమితికి మించి డీపియం విపరీతంగా ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే బాధితులకు మూర్ఛ లక్షణాలు ఉన్నాయని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news