సింగరేణిని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారు – ఎంపీ రంజిత్ రెడ్డి

-

సింగరేణి ప్రైవేట్ పరం చేస్తే ఉద్యోగులు నష్టపోతారని అన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి కాలనీ సౌత్ ఇండియాలోని అతిపెద్ద కంపెనీ అని చెప్పారు. సింగరేణి వేలంలో ఎలా పెడతారు అని ప్రశ్నించారు రంజిత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరిన ఇవ్వట్లేదని ఆరోపించారు.

కేంద్రం పాలసీ ప్రకారమే వేలంలో పెట్టామని చెబుతుందని, 11 ఏ కండిషన్ లో తమకు అలోకేట్ చేయమని కోరామన్నారు. నాలుగు బ్లాకులు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని, ప్రైవేట్ పరం చేయడం వల్ల ఉద్యోగులు నష్టపోతారని తెలిపారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్రానికి 49% వాటా ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news