ఇంగ్లాండ్‌ ప్లేయర్స్ తో క్రికెట్‌ ఆడిన రిషి సునాక్‌.. వీడియో వైరల్‌

-

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ఎక్కువగా తనని తాను సాధారణ పౌరుడిలాగే భావిస్తూ ఉంటారు. దీనికి ఇప్పటికే మనం చాలా ఉదాహరణలు చూశాం. చిన్నపిల్లలతో కలిసి ముచ్చటిస్తుంటారు. టీనేజ్ పిల్లలతో కలిసి సెల్ఫీలకు పోజులిస్తుంటారు. ఇలా రిషి సామాన్య పౌరుడిలా ప్రజల్లో ఈజీగా కలిసిపోతుంటారు. మరోవైపు రిషిలో మంచి క్రికెట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. తాజాగా  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే రిషి ఎంత మంచి క్రికెట్ ప్లేయరో మీకే తెలుస్తుంది.

గతేడాది నవంబరులో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ జట్టు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను  డౌనింగ్‌ స్ట్రీట్‌ 10 లోని ఆయన అధికారిక భవనంలో కలిసింది. భవనంలోని గార్డెన్‌లో ఆటగాళ్లంతా ఆయనతో సరదాగా గడిపారు. అందరూ కలిసి క్రికెట్‌ ఆడారు. ఆల్‌రౌండర్‌ సామ్‌కరన్‌ బౌలింగ్‌కు సునాక్‌ బ్యాటింగ్ చేశారు. కొన్ని మంచి షాట్లు ఆడిన సునాక్‌ క్రిస్‌ జోర్డాన్‌ బంతికి ఔటయ్యారు. తర్వాత ఆయన కూడా బౌలింగ్‌ చేశారు. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌తో పాటు సామ్‌కరన్‌, పేసర్‌ క్రిస్‌జోర్డాన్‌, లియమ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఫిల్‌ సాల్ట్‌, క్రిస్‌ వోక్స్‌, రిచర్డ్ గ్లీసన్‌, టైమల్‌ మిల్స్‌ పాల్గొన్నారు. వీరంతా సరదాగా గడిపిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news