అద్దె ఇల్లు ఖాళీ చేయమంటే ఇక జైలే…!

-

కరోనా వైరస్ పై పోరాటంలో వైద్యులు పోలీస్ సిబ్బంది పాత్ర చాలా కీలకం. వారు లేకపోతే ప్రపంచం మొత్తం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వారిని చాలా దేశాల్లో దేవుళ్ళు మాదిరిగా చూసే పరిస్థితి నెలకొంది. అయితే వారి విషయంలో కొందరు వ్యవహరిస్తున్న వ్యవహారశైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని వెళ్లిపోవాలి అని ఆదేశాలు ఇస్తున్నారు కొందరు.

బెదిరించే పరిస్థితిలో కూడా వాళ్ళు ఉన్నారు. వైద్యులు వైద్య సిబ్బందిని బెదిరిస్తున్న వారి విషయంలో ఇక కఠినం గా ఉండాలని ఏపీ సర్కార్ కి ఆ రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అద్దె ఇళ్లను ఖాళీ చేయాలని సదరు ఇంటి యజమాని బెదిరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, వైద్యుల ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి(పీపీఈ)ని అందుబాటులో ఉంచడడమే కాకుండా… వారికి అనువైన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని దానికి సంబంధించిన అనువైన సదుపాయాలు కల్పించాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని హైకోర్ట్ కి ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ నాయకులు కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని కూడా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news