దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి గాని తగ్గే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. కట్టడి చేయడానికి లాక్ డౌన్ ఉన్నా సరే కట్టడి అయ్యే పరిస్థితి దాదాపుగా లేదు అనే అంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 7,500 పైగా కరోనా కేసులు ఉన్నాయి. 250 మంది వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 520 మంది కరోన వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న ఒక్క రోజే దేశంలో దాదాపు 650 కి పైగా కరోనా కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యంత వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అక్కడ దాదాపు 1400 మంది బాధితులు ఉండగా… ముంబై లో ఎక్కువ కేసులు… దాదాపు 900 పైగా కేసులు నమోదు అయ్యాయి.
ఇక ముంబై మురికివాడ దారవి లో 7 లక్షల వరకు పరిక్షలు నిర్వహించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కేసులు 381 ఉండగా… ఇప్పటివరకూ ఆరుగురు చనిపోయారు. తెలంగాణాలో ఈ సంఖ్య 500 కి చేరువలో ఉంది. అయితే మరణాల సంఖ్య తెలంగాణా లో చాలా తక్కువ. బాధితులు కూడా క్రమంగా కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్నారు. కేసులు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.