నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్‌లో కిడ్నాపైన 9 ఏళ్ల బాలుడు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ కేసు విషాదంతం అయిన సంగతి తెలిసిందే. ఈ బాలుడి శవం మహబూబాబాద్ శివారులోని గుట్టల్లో గుర్తించారు. ఆదివారం దీక్షిత్ ను దగ్గరి బంధువులే కిడ్నాప్ చేశారు. బాలుడిని చంపెశాకనే వారు రూ.45 లక్షలు డిమాండ్ చేశారని అంటున్నారు. కిడ్నాపర్లకు డబ్బు ఇచ్చేందుకు దీక్షిత్ తండ్రి తెలిసినవారందరి దగ్గర అప్పులు కూడా చేశాడు. ఆ డబ్బుల బ్యాగుతో కిడ్నాపర్లు రమ్మన్న చోటికి కూడా వెళ్లి రాత్రి అంతా అక్కడే ఉన్నాడు.
ఇంతలో దుండగులు బాలుడ్ని హత్య చేసినట్టు బయటకి రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులను ఎన్ కౌంటర్ చేసినట్టు చెబుతున్నారు. బాలుడిని హత్య చేసిన ఇద్దరు కిడ్నాపర్లు ఎన్‌కౌంటర్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కిడ్నాపర్ల ఎన్‌కౌంటర్‌పై అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీని మీద మరికాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. అందులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.