పోలవరం పై ఏపీ కి షాకిచ్చిన కేంద్రం…!

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి కేంద్రం షాక్‌ ఇచ్చింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న పోలవరం అంచనా వ్యయాన్ని… 2013-14లో పేర్కొన్నట్లుగా రూ.20,398.61 కోట్లకే పరిమితం చేసింది. 2013లో వచ్చిన కొత్త భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరగడంతో… ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,548.87కోట్లకు చేరుకుంది. అయితే ఈ పెరిగిన ఖర్చంతా కేంద్రమే భరించాలని చంద్రబాబు సర్కార్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.ఆ తర్వాత ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో ఈ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.

భూసేకరణ వ్యయాన్ని రూ.47,725.24 కోట్లకు మాత్రమే కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం తెలిపింది.రాష్ట్ర విభజన సమయంలో యూపీఏ మంత్రివర్గం ఆమోదించిన అంచనా వ్యయానికి మాత్రమే కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పింది. దీనిపై ఈనెల 12వ తేదీన పీపీఏకు లేఖ రాసినట్లు తెలుస్తుంది.