జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్…ముగ్గురు జైషేమహ్మద్ ఉగ్రవాదుల హతం

-

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భద్రతా బలగాలకు విజయం లభించింది. తాజాగా బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా చంద్ గామ్ గ్రామంలో ఎన్  కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ లో మగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరిని పాకిస్థాన్ జాతీయుడిగా పోలీసులు గుర్తించారు. వీరంతా నిషేధిత జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారు. ఎన్ కౌంటర్ స్థలం నుంచి మందుగుండు సామగ్రి, ఎం-4 కార్బైన్, ఎకే సిరీజ్ గన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇది తమకు పెద్ద విజయమని ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు.

24 గంటల్లో ఇది రెండో ఎన్ కౌంటర్. అంతకుముందు మంగళవారం రోజు కాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. కుల్గాం జిల్లా ఓకై గ్రామంలో కార్డన్ సెర్చ్ జరుగుతున్న క్రమంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news