ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ స్టార్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ని ఎదురుకాల్పుల్లో పోలీసులు హతమార్చారు. కాగా అతని వద్ద నుండి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ యూపీ ఝాన్సీ వద్ద జరిగింది. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించారు. అసద్ అహ్మద్, గులామ్ లను పోలీసులు హతమార్చారు.
ప్రయాగ్రాజ్ లో జరిగిన ఓ మర్డర్ కేసులో ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నిందితులు. అలాగే ఉమేష్ పాల్ మర్డర్ కేసులో అసద్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బిజెపి ఎన్కౌంటర్లు నిర్వహిస్తోందని మండిపడ్డారు. మతం పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారని విమర్శించారు. బుల్లెట్లతో న్యాయం చేస్తామని నిర్ణయించినప్పుడు.. ఇక న్యాయస్థానాలు ఎందుకని ప్రశ్నించారు.