స్ట్రాబెరీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని చాలా మంది డైట్ లో స్ట్రాబెరీలు ని తీసుకుంటూ ఉంటారు. స్ట్రాబెరీలు లో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి తాజాగా చేసిన స్టడీ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. స్ట్రాబెర్రీలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని తెలుస్తోంది. సరైన బ్లడ్ ఫ్లో జరిగి గుండె సమస్యల కి దూరంగా ఉండేందుకు స్ట్రాబెరీలు బాగా సహాయం చేస్తాయి.
స్ట్రాబెర్రీలని తీసుకుంటే ఇంఫ్లమేషన్ తగ్గుతుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి బయటపడొచ్చు. డైలీ రొటీన్ లో మీరు స్ట్రాబెరీస్ ని ఈ విధంగా తీసుకోవచ్చు. స్ట్రాబెరీ లతో స్మూతీ తయారు చేసుకుని మీరు ఫ్రెష్ గా తీసుకోవచ్చు. పాలతో కానీ పెరుగుతో కానీ స్ట్రాబెర్రీలని మిక్సీ పట్టేసి తీసుకోవచ్చు.
కావాలనుకుంటే ఇందులో అరటి పండ్లను కానీ బ్లూ బెర్రీస్ ని కానీ యాడ్ చేసుకోవచ్చు సలాడ్ మీద స్ట్రాబెర్లని కూడా వేసుకుని తీసుకోవచ్చు. ఫ్లేవర్ కూడా బాగుంటుంది పోషక పదార్థాలు కూడా ఉంటాయి. స్ట్రాబెర్రీలతో మీరు కావాలనుకుంటే సాల్సా చేసుకోవచ్చు నిమ్మరసం వంటివి వేసుకునే స్పైసీగా తీసుకోవచ్చు. చాక్లెట్ లో డిప్ చేసుకొని కూడా తీసుకోవచ్చు ఇలా ఇన్ని విధాలుగా మీరు స్ట్రాబెర్రీలని తీసుకోవచ్చు.