ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారు. ఎక్కడా కూడా పనుల్లో జాప్యం లేకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే పోలవరం లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం చేసారు ఇంజనీరింగ్ అధికారులు. గోదావరి వరద దిశ మారుతుంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేసారు.
సహజసిద్ధంగా వెళుతున్న గోదావరి నదిని అధికారులు మూసి వేసారు. స్పిల్వే ద్వారా నీటి తరలింపుకు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ యేడాది 14 గేట్ల ద్వారా ప్రాజెక్టు స్పిల్వే నుండి గోదావరి వరద తరలిస్తారు. ఇప్పటికే స్పిల్ చానల్ పనులు పూర్తి అయ్యాయి. 2022 చివరికి పోలవరం పనులను పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం అంటుంది.