కేసీఆర్‌, కేటీఆర్ మాట‌ల‌ను లెక్క చేయ‌ని జూడాలు.. ప్ర‌తిప‌క్షాల‌కు మంచి ఛాన్స్‌!

-

తెలంగాణ‌లో గ‌త మూడు రోజులుగా జ‌రుగుతున్న జూనియ‌ర్ డాక్ట‌ర్ల స‌మ్మె ర‌స‌వ‌త్త‌రంగా మారింది. కేసీఆర్ గాంధీ ఆస్ప‌త్రి విజిట్ చేసిన సంద‌ర్భంగా వారి స‌మ్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఏమేం స‌మ‌స్య‌లు ఉన్నాయో వాట‌న్నింటినీ త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరారు. వెంట‌నే జూడాలు కూడా త‌మ సమ‌స్య‌ల గురించి విన‌తిప‌త్రం అంద‌జేశారు.

అయితే కేసీఆర్ హామీ ఇచ్చిన‌ప‌ప‌టికీ అవి నెర‌వేర‌క పోవ‌డంతో జూడాలు భ‌గ్గుమంటున్నారు. బుధ‌వారం నుంచి కొవిడ్ అత్య‌వ‌స‌ర సేవ‌లు కూడా బ‌హిష్క‌రించి నిర‌స‌న తెలుపుతున్నారు. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగారు.

జూడాలు చేస్తున్న స‌మ్మెకు ఇది స‌మ‌యం కాద‌ని, వెంట‌నే వారు విధుల్లో చేరాల‌ని, లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అటు కేసీఆర్ కూడా దీనిపై స్పందించిన‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని, ముందు డ్యూటీల్లో జాయిన్ కావాల‌ని తెలిపిన‌ట్టు స‌మాచారం. అయితే జూడాలు మాత్రం త‌మ‌కు స్ప‌ష్ట‌మైన జీవో విడుద‌ల చేస్తేనే విధుల్లో చేర‌తామ‌ని తెలుపుతున్నారు. ఈ పాయింట్‌ను అటు ప్ర‌తిప‌క్షాలు అవ‌కాశం చేసుకుని విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నాయి. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే వారిని పిలిచి చ‌ర్చించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news