ఆసక్తికరంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్.. భారత్ గెలిచేనా?

-

సౌతాంప్టన్‌లో ఈ నెల 18 నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఆసక్తికరంగా సాగుతుందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్ అన్నారు. టెస్ట్ మ్యాచ్‌లలో భారత్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా పోరాడి ఫైనల్ మ్యాచ్ వైపు అడుగులు వేశాయన్నారు. ఐదు రోజుల పాటు ఈ రెండు జట్ల ఆటతీరు అందరినీ కట్టిపడేస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠినతర టెస్ట్ మ్యాచ్‌లలో కష్టపడి ఆడి…. నేడు ఫైనల్ మ్యాచ్‌కు రావటం అదృష్టమన్నారు. మేలైన ఆటతీరును ఇరు జట్ల నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆశించవచ్చని చెప్పారు. క్రికెట్‌లో ప్రతి రంగంలో మెరుగ్గా ఆడినవారిదే విజయం వరిస్తుందన్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటిదే ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా, కివీస్ నుంచి ఆశిస్తున్నామన్నారు. సౌతాంప్టన్ పిచ్‌ ఏ విధంగా ఇరు జట్లకు సహకరిస్తుందనేది వేచి చూడాల్సిందేనన్నారు.

ఇటీవల కాలంలో భారత్ గెలిచిన టెస్ట్ మ్యాచ్‌లు అన్నీ స్పిన్‌ను నమ్ముకుని విజయం సాధించిందని, కొత్త వాతావరణంలో గెలుపు సాధించాలంటే బౌలింగ్ కూడా విభిన్నంగా ఉండాలని డేవిడ్ గోవర్ తెలిపారు. ఇంగ్లండ్ గడ్డపై పేస్ బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత జట్టులో మేలైన పేసర్లు ఉన్నారని, వారంతా ఎలా పరిస్థితులను అధిగమిస్తారో చూడాలన్నారు. కివీస్ పేసర్లు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో మెరుగ్గా రాణించారని గుర్తుచేశారు. ఇరు జట్లలో ప్రపంచంలో మేటి ఇద్దరు బ్యాట్స్‌మెన్ మనకు మ్యాచ్‌లో కనిపించనున్నారు. విరాట్ కోహ్లీ, కేన్ విలియం సన్‌ ఆటతీరు ఎలా ఉంటుందో మ్యాచ్‌లో చూసి అందరూ ఆనందపడాలన్నారు. టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్‌ ఇటీవల కాలంలో క్లిష్టపరిస్థితుల్లో రాణించి అందరినీ ఆకట్టుకుంటున్నారని చెప్పారు. ఇటువంటి ఆటతీరు టెప్ట్ ఛాంపియన్‌షిప్‌లో అందరూ చూసి ఆనందించాలన్నారు గోవర్. 64 ఏళ్ల ఇంగ్లండ్ ఈ మాజీ కెప్టెన్ గోవర్ ఆ రోజుల్లో 11 వేల పరుగులు చేసి అందరినీ అలరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news