ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ (నిజామాబాద్ జిల్లా) బిడ్డ నిఖత్ జరీన్ కు కేంద్రం అర్జున అవార్డును ప్రకటించింది. క్రీడారంగంలో అత్యంత ప్రతిభను కనబరిచే క్రీడాకారులకు ప్రతి ఏటా ఇచ్చే అర్జున అవార్డుల్లో ఈసారి నిఖత్ జరీన్‌కు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన నిఖత్‌కు అర్జున అవార్డు రావడం తెలంగాణకే గాక, దేశానికే గర్వకారణమని మంత్రి అన్నారు. ప్రపంచ స్థాయిలో మరింతగా రాణించి, దేశ కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని నిప్పులు చెరిగారు మంత్రి ఎర్రబెల్లి . కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం నిధులు విడుదల చేయకున్నా.. త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని మంత్రి దయాకర్ రావు స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి.