యోనో యాప్ లో ఎర్రర్, స్టేట్ బ్యాంకులో రచ్చ….!

-

ఆన్‌ లైన్ లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి అని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు బుధవారం పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసారు. కొంతమంది వినియోగదారులు ఎస్బిఐ యోనో యాప్ లోకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది అని, దాని వలన లాగిన్ అవ్వలేకపోతున్నామని చెప్పారు. మంగళవారం నుంచి బ్యాంకు కస్టమర్లు సాంకేతిక లోపాల గురించి ఫిర్యాదులు చేస్తున్నారు.

అయినా సరే ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. నాలుగైదు సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ తాను ఆన్‌ లైన్‌ లో డబ్బు పంపించలేకపోయా అని నోయిడాకు చెందిన ఎస్‌బిఐ కస్టమర్ ఒకరు జాతీయ మీడియాకు చెప్పారు. ఎస్‌బిఐ బ్యాంక్ వినియోగదారులకు ఆన్‌ లైన్‌ లో డబ్బు పంపించే విషయంలో ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇంకా స్టేట్ బ్యాంకు క్లారిటీ ఇవ్వలేదు. మొబైల్ అప్లికేషన్ అయిన యోనో, ‘M005’ అనే ఎర్రర్ కోడ్‌ ను చూపిస్తోందని, ఆన్‌లైన్ లావాదేవీల్లో ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news