తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నియంత్రించడానికి పోలీసు శాఖ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థ పని చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మాదక ద్రవ్యాల నియంత్రణపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. కాగ తాజా గా మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాదక ద్రవ్యాలను నిర్మూలించడానికి ప్రత్యేకంగా రెండు విభాగాలను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్, నార్మోటిక్స్ ఇన్వెస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ అనే పేర్లతో రెండు విభాగాలను తెలంగాణ పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు స్పెషల్ వింగ్స్ కూడా హైదరాబాద్ కమిషనరేట్ ను కేంద్రంగా చేసుకుని నిధులు నిర్వహిస్తాయి. వీటిని నేడు డీజేపీ మహేందర్ రెడ్డి ప్రారంభిస్తారు. నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్ లో ఒక డీసీపీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్ఐలు, 20 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. అలాగే నార్కోటిక్స్ ఇన్వేస్టిగేషన్ సూపర్ విజన్ వింగ్ లో ఒక ఏసీపీ, ఒక ఇన్ స్పెక్టర్, ఒక ఎస్ఐ, 6 గురు కానిస్టేబుల్స్ ఉంటారు.