ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలకు ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ రెండవ మాసంలో నిర్వహించేలా జగన్మోహన్రెడ్డి సర్కారు సన్నాహాలు చేస్తోంది.ఇక ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఇవాళ లేదా రేపు అధికారికంగా జగన్ సర్కార్ ప్రకటించే అవకాశం ఉంది.
మార్చి మాసంలో గా ప్రాక్టికల్స్ నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే ఫ్రీ ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఉండనున్నాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించాలని చూస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యంగా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేసింది జగన్ సర్కార్. అయితే ఈసారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఎలాగైనా పరీక్షలు నిర్వహించాలని యోచనలో ఉంది