బీజేపీ ప్రళయం వ‌స్తుంది… దాన్ని కెసిఆర్ తట్టుకోలేడు : ఈట‌ల సంచ‌లనం

రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ శిక్షణా తరగతుల లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే రోజుల్లో బీజేపీది ప్రళయం ఉంటుంది. దాన్ని కెసిఆర్ తట్టుకోలేడని హెచ్చ‌రించారు. సీఎం కెసిఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటాన‌ని వార్నింగ్ ఇచ్చారు ఈట‌ల రాజేంద‌ర్‌. సీఎం కెసిఆర్ వ్యూహాలు తెలిసిన వాడిని…కెసిఆర్ ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

హుజూరాబాద్ గెలుపును పక్కదోవ పట్టించడం కోసం అనేక ఎత్తుగడలు వేశాడని నిప్పులు చెరిగారు ఈట‌ల‌. హుజూరాబాద్ ప్రజలు కెసిఆర్ ను కొట్టిన దెబ్బకు వచ్చి ధర్నాచౌక్ లో పడ్డాడని ఆగ్ర‌హించారు. భూమి మీదకు దిగివచ్చాడు. ఫామ్ హౌజ్ నుండి బయటికి వచ్చాడని మండిప‌డ్డారు. ప్రగతిభవన్ ఇనుపకంచెలు కూడా తొలగిపోవాలని పేర్కొన్నారు. మనం వేగం పెంచాలి అని బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగురు వేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఈటెల‌.