కుంభకర్ణడిలా కేసీఆర్‌ నిద్ర పోతున్నాడు : ఈటల రాజేందర్‌

-

కుంభకర్ణడిలా కేసీఆర్‌ నిద్ర పోతున్నాడని ఈటల రాజేందర్‌ ఫైర్‌ అయ్యారు. కరీంనగర్ లోని బెయిల్ పై విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మీడియా పై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయపడుతున్నారని.. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని ఫైర్‌ అయ్యారు.

రాష్ట్రపతి సవరణ చేసి జీవో నెంబర్ 124 ఇచ్చారని.. స్థానికత ఆధారంగా టీచర్లను, ఉద్యోగులను విభజించాలన్నారు. మూడు సంవత్సరాల పాటు కుంభకర్ణ నిద్ర పోయిన తర్వాత  సీఎం జీవో నెంబర్ 317 ఇచ్చారని… ఆదరాబాదరాగా ఆర్డర్ ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం వారి వినతులు కూడా స్వీకరించక పోతే, మా దగ్గరికి వస్తే మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు వారి పక్షాన జాగరణ చేపట్టాడన్నారు. కరీంనగర్ సిపి ప్రత్యక్షంగా పాల్గొని లాఠీఛార్జి చేసి, అరెస్టు చేసి, జైలు పాలు చేశారు. ఇన్ని చేసినా మేము సహించామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను కేసులు పెట్టారు భయభ్రాంతులకు గురి చేశారు సరే… కానీ ఆ ఉద్యోగులకు న్యాయం చేయండి. స్థానికత ఆధారంగా నియామకాలు బదిలీలు చేయండని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news