ఎట్టకేలకు ఆ హీరోతో తన ప్రేమను ఒప్పుకున్న మంజీమా మోహన్..!!

-

కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తీక్, హీరోయిన్ మంజీమా మోహన్.. మధ్య ఏదో ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వినిపించాయి. అయితే అందుకు సంబంధించిన వార్తల పైన ఆ మధ్య ఒకసారి మంజీమా మోహన్ స్పందించింది. అయితే అప్పుడు అతని ప్రేమను మాత్రం అంగీకరించలేదు. ఒకవేళ నిజంగా లవ్లో పడితే కచ్చితంగా ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తానని చెప్పి స్పందించడం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు సోషల్ మీడియాలో ఆ వార్తలను నిజం చేస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ వాటి గురించి తెలుసుకుందాం.

తాజాగా ఇమె తన ప్రేమ గురించి స్పందిస్తూ గౌతమ్ కార్తీతో ప్రేమలో ఉన్నట్లుగా తెలియజేసింది. మూడు సంవత్సరాల క్రితమే తన జీవితంలోకి అడుగు పెట్టావు.. లైఫ్ ని ఎలా చూడాలో నేర్పించావు.. దిక్కుతోచని స్థితి పరిస్థితులు ఎదురైన ప్రతిసారి అందులో నుంచి బయటకు తీసుకువచ్చావు.. నా మీద ఎంతో ప్రేమ కురిపించావు.. అందుకే నీతో లవ్ లో పడిపోయాను అంటూ సోషల్ మీడియాలో మంజీమా రాసుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ట్వీట్ చూసిన పలువురు నేటిజెన్లు సైతం ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమయ్యాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక మంజీమా మోహన్.. “సాహసం శ్వాసగా సాగిపో” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత మరి ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు.గౌతమ్ కార్తీక్ తో ప్రస్తుతం కోలీవుడ్లో పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నది.

 

View this post on Instagram

 

A post shared by Manjima Mohan (@manjimamohan)

Read more RELATED
Recommended to you

Latest news