నా గుర్తు పువ్వు గుర్తు.. ఎల్లగొట్టినందుకు ప్రతీకారం తీర్చుకుంటా : ఈటల

తెలంగాణ సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఆత్మగౌరవం.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆత్మ గౌరవమని…అహంకారానికి, న్యాయానికి యుద్ధమని.. ఇది కురుక్షేత్రం యుద్ధమని పేర్కొన్నారు ఈటల. ఈ రోజు నా గుర్తు పువ్వు గుర్తు.. ఎల్లగొట్టినందుకు ప్రతీకారం తీరచ్చుకుంటానని హెచ్చరించారు ఈటల. కమలాపూర్ లో డబ్బులు పట్టుకొని తిరుగుతున్న మీ నాయకులను తరిమి కొడతామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నారని.. సంఘాలు ఉండాలే.. సంఘాలు చచ్చిపోతే వ్యవస్థ సచ్చిపోతుందని పేర్కొన్నారు. నాయకులను కొనచ్చు కానీ ప్రజలను కొనలేరన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకు ఎమ్యెల్యే గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పుణ్యమా అని ఎమ్యెల్యే గా గెలిచినా అని.. మొదటి సారీ గెలవడం ఈజి.. కానీ రెండవ సారీ గెలవడం కష్టమన్నారు. 2023 తరువాత టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. తరువాత వచ్చే ప్రభుత్వంలో వచ్చే స్కీం చాలా గొప్పగా ఉంటాయన్నారు. మంత్రులకు దొరకని సీఎం ఒక సామాన్యుడి ఎలా ఆపాయింట్ మెంట్ ఇచ్చాడని.. నాపై ఎలా ఎంక్వయిరీ చేయించారు ప్రశ్నించారు. నీ మంత్రులకు అదేశం ఇచ్చి నా నియోజకవర్గంలో డబ్బులు పంపి సొంత పార్టీ నాయకులను కొంటున్నావని ఫైర్ అయ్యారు.