కెసిఆర్ అహంకారానికి ఘోరీ కట్టడం ఖాయం : ఈటల

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరోసారి సిఎం కెసిఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆశీర్వాదాలు అందాయని.. బిడ్డా కేసీఆర్ నీకు అన్యాయం చేసిండు అని అంటున్నారని పేర్కొన్నారు. చైతన్యవంతమైన ఇక్కడి ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారని.. మా ప్రజలు ప్రేమకు లొంగుతారు.. ప్రగల్బాలకు లొంగబోరని చురకలు అంటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఏది చెప్పినా ప్రజలు నమ్మరని.. హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ అహంకారానికి ఘోరీ కట్టడం ఖాయమని.. దానికోసం సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఈటల రాజేందర్.

రేపటి నుండి ఇంటి ఇంటి ప్రచారం చేస్తాననని.. ప్రగతి భవన్ లో రాశిస్తే.. చదివే మంత్రులు కుటుంబాల్లో ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవాలని ఫైర్ అయ్యారు ఈటల. రాచరికాన్ని బొంద పెట్టడం కోసం హుజురాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. చైతన్య వంతమైన నియోజకవర్గ హుజురాబాద్ అని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎన్నికలు వస్తే అన్ని సార్లు గెలిపించారని ఈటల రాజేందర్ తెలిపారు.