టీఆర్ఎస్ బిగ్ షాక్ : ఈటలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా !

ఢిల్లీ: ఇవాళ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ను తెలంగాణ బిజేపి నేతలతో మాజీ ఈటల రాజేందర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈతల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ను కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించామని చెప్పిన ఈటల.. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన చెప్పారని తెలిపారు.

ఇందు కోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తా అన్నారని చెప్పుకొచ్చారు ఈటల. ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.
హుజురాబాద్ మాత్రమే కాదు ఇక పై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ పార్టీ మాత్రమేనని వెల్లడించారు ఈటల. అటు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయన్నారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా తెలంగాణకు వస్తామని అన్నారని పేర్కొన్నారు. అలాగే పాదయాత్రకు కూడా ఆయనను ఆహ్వానించామని…ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధమేనని స్పష్టం చేశారు.