నేను గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుంది : ఈటల

తాను గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారుతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలం నాగారం గ్రామంలో ప్రచారంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… ఈ తమ్ముడు జీతం ఇస్తే తకు జీతం వస్తుంది అని చెప్పిన కేసీఆర్ ఇన్ని సంవత్సరాలుగా కుడిభుజంగా ఉన్న తమ్ముడు ఇప్పుడు దయ్యం ఎట్లా అయ్యాడో ఆలోచన చేయాలన్నారు.

etala
etala

కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశానని.. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈటల రాజేందర్ ప్రజలు ప్రాణాలు కాపాడడంలో బాగా పని చేశారు అని పొగిడారని గుర్తు చేశారు. అలా పొగడడం చూసిన కెసిఆర్ తట్టుకోలేక పోయారని మండిపడ్డారు.

తనను బయటికి పంపే వరకు నిద్రపోలేదని.. రాజీనామా చెయ్యి అంటే సిగ్గు లేని బ్రతుకు ఎందుకు అని మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు ఈటల. రాజీనామా చేసినప్పటి నుండి ఎన్ని ఉత్తరాలు పుట్టిస్తున్నారని.. మీరు మూర్ఖులు, పచ్చకామెర్లు వారి లాగా నటిస్తున్నారని నిప్పులు చెరిగారు. తాను ప్రజల గుండెల్లో ఉన్నానని.. ఇంత నీచమైన మాటలా ? అని ప్రశ్నించారు. తనను ఓడగొట్టే సత్తా కెసిఆర్ డబ్బు, మద్యం, దబాయింపులకు లేదన్నారు. టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు వారి వారి నియోజకవర్గంలో దద్దమ్మలు అని మండిపడ్డారు.