టిఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు…సర్వేల్లో తేలిపోయింది : ఈటల

-

హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని.. సర్వేలే చెబుతున్నాయని మాజీ మంత్రి, బిజేపి నేత ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ లో హుజురాబాద్ ఎన్నికల ఊసే లేదని కేటీఆర్ చెప్పారని.. హుజురాబాద్ లో గెలిచ్నంత మాత్రాన మా ప్రభుత్వం కులిపోయేది లేదు అన్నారని ఈటల తెలిపారు.

ఆలాంటప్పుడు గొర్ల మంద మీద తోడేళ్ళు పడ్డట్లు ఎమ్మెల్యేలు, మత్రులు నియోజక వర్గం మీద ఎందుకు పడుతున్నారని.. సొంత పార్టీ నాయకులను ప్రలోభ పేట్టి, ఖరీదు కట్టి చిల్లర పనులు చేసి కేసీఆర్ అభాసు పాలు అయ్యారని చురకలు అంటించారు. సిఎమ్ఓలో ఒక దళిత అధికారి అయిన పెట్టావ అని ప్రశ్నించాను. వెంటనే నియమించారని తెలిపారు.

నా రాజీనామా తో హుజురాబాద్ లో పెన్షన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇండియా టుడే సర్వేలో ముఖ్యమంత్రి కెసిఆర్ పలుకుబడి 84 శాతం పడి పోయిందని.. ఇవన్ని పెట్టిన తర్వాత కూడా సర్వే చేస్తే ఈటెల కు మాత్రమే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. కొన్ని వందల కోట్ల జీవోలు ఇచ్చినా టీఆరెఎస్ గెలువదని రిపోర్ట్ రావడంతో నిన్న కేసీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news