ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సిబిఐ ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టింది సిబిఐ కోర్టు. ఈ సందర్భంగా ఇరు పిటిషన్ దారుల వాదనలను విన్న సిబిఐ కోర్టు…. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పును వచ్చే నెల 15 కు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
అటు వైసిపి పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై కూడా వాదనలు ముగిశాయి. ఈ రెండు పిటిషన్ల పై తీర్పును వచ్చే నెల 15 న వెల్లడిస్తామని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ కోర్టు తాజా నిర్ణయంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు విజయసాయిరెడ్డికి కాస్త ఊరట లభించింది. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.