ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఒంటిర చేయాలె. ఆయనకు ఉన్న బీసీ క్రేజ్‌ను దెబ్బ కొట్టాలె. దీని కంటే ముందు ఆయన వెనక ఉన్న రెడ్డి, వెలమ నేతలను టీఆర్ ఎస్ పార్టీవైపు లాగేసుకోవాలి. ఇప్పుడు ఇదే టీఆర్ ఎస్ వేస్తున్న స్కెచ్. దీంట్లో భాగంగా చాకచక్యంగా పావులు కదుపుతోంది. టీఆర్ ఎస్ వ్యతిరేక, అనుకూల వర్గాలపై ఫోకస్ పెట్టింది.
హుజూరాబాద్ రాజకీయాల్లోకి ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఎంటరైనప్పటి నుంచి పక్కా ప్లాన్ ప్రకారం టీఆర్ ఎస్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈటల వెంట ఉన్న వారంతా బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు. ఇదే అవకాశంగా టీఆర్ ఎస్ రెడ్డి, వెలమ నేతలను ఈటల నుంచి లాగేసుకుంటోంది.
వారితోనే ఈటలపై విమర్శలు చేయిస్తోంది. ఈటల వెంట మొన్నటి వరకు కలిసి నడిచిన అగ్ర సామాజిక వర్గాలైన వెలమ, రెడ్డి, ఇతర వర్గాల నాయకులను పార్టీవైపు మళ్లేలా గంగుల చర్చలు జరుపుతున్నారు. దీంతో వారంతా సులువుగానే పార్టీకి జై కొడుతున్నారు. వారే స్వయంగా ఈటలపై ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఒక్కో సామాజిక వర్గాన్ని ఈటల నుంచి వేరు చేసి.. చివరకు ఒంటరి చేయాలనేదే టీఆర్ ఎస్ ప్లాన్.