గెలుపు దిశగా గులాబీ.. నైతిక విజయం మాదే : ఈటల

-

క్షణ క్షణ ఉత్కంఠ భరితంగా సాగుతున్న మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్‌ దాదాపు చివరి దశకు వచ్చేసింది..మొదట నుంచి టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలోనే కొనసాగుతూ వస్తుంది. మొదట్లో కాస్త బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. దీంతో నెక్ టూ నెక్ ఫైట్ జరిగింది. కానీ నిదానంగా గులాబీ పార్టీ లీడింగ్ పెంచుకుంటూ వచ్చింది. 15 రౌండ్లలో జరుగుతున్న కౌంటింగ్‌లో 11 రౌండ్లు ముగిశాయి. 11వ రౌండ్ ముగిసే సరికి 5774 ఓట్ల ఆధిక్యంలోకి టీఆర్ఎస్ వచ్చింది.

11వ రౌండ్‌లో టి‌ఆర్‌ఎస్‌కు 7235 ఓట్లు, బి‌జే‌పి- 5877 ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్ గట్టుప్పల్ మండలంకు సంబంధించింది. ఈ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. ఇక దాదాపు 6 వేల లీడింగ్‌కు రావడం, ఇంకో నాలుగు రౌండ్లు ఉండటంతో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది.. ఇంకా గెలుపు తమదే అని ఫిక్స్ అయిపోయారు..అప్పుడే ప్రగతి భవన్‌లో గెలుపు సంబరాలు మొదలవుతున్నాయి.

12,13 రౌండల్లో మర్రిగూడ మండలం, 14,15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్లను లెక్కించనున్నారు. ఇదిలా ఉంటే ఫలితం ఆలస్యం కావడంపై బి‌జే‌పి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ అధికారులు టి‌ఆర్‌ఎస్ కు అనుకూలంగా నడుస్తున్నారని ఆరోపిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ నైతికంగా ఓడిపోయారని, నైతికంగా బీజేపీ గెలిచిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇంతలా ప్రలోభపెట్టిన టిఆర్ఎస్‌కు ఆదరణ లేదని, వామపక్షాలు లేకపోతే టీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఈటల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news