ఇండియాలో రూ.25 లక్షల కన్నా తక్కువ ధర ఉన్న కార్లు ఏవో తెలుసా..?

ఇండియాలో శరవేగంగా ఈవీ శకం ప్రారంభమైంది. విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లకు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. ఈవీ వాహనాలను బుక్ చేసుకుంటే వినియోగదారులకు డిలవరీ కావడానికి నాలుగైదు నెలలు పడుతోంది. ప్రస్తుతం ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. ఇండియాలో రూ. 25 లక్షల కన్నా తక్కువ ధర ఉంటే ఎలక్ట్రిక్ కార్లు ఏమిటో తెలుసా.. అయితే ఓ లుక్కేద్దాం పదండి….

టాటా టిగోర్ ఈవీ

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా నుంచి పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు తయారుచేస్తోంది. ప్రస్తుతం టాటా నుంచి టాటా టిగోర్ ఈవీ ప్రజలకు అందుబాటులో ఉంది. కేవలం రూ. 11.99 లక్షలకే ఈకారును టాటా అందిస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 312 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వాహనంగా టిగోర్ ను తయారు చేశారు. ప్రస్తుతం ఎల39క్ కార్లలో సెడాన్ వెర్షన్ లో టాటా టిగోర్ ఈవీ మాత్రమే ఉంది.

టాటా నెక్సాన్

ప్రస్తుతం ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ టాప్ లో ఉంది. కాంపాక్ట్ ఎస్ యూ వీల్లో టాటా నెక్సాన్ లభిస్తోంది. ఇండియాలో సెఫెస్ట్ కార్ల జాబితాలో కూడా టాటా నెక్సాన్ మంచి మార్కులు సాధించింది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో 6 వేలకు పైగా యూనిట్ల కార్లను అమ్మింది. 30.2 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ తో సుమారు 312 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. దాదాపుగా 14 లక్షల నుంచి 17 లక్షల్లో టాటా నెక్సాన్ ధర ఉంది.

ఎంజీ జెడ్ ఎస్ ఈవీ

టాటా నెక్సాన్ తరువాత అత్యధికంగా అమ్ముడవుతన్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఎంజీ జెడ్ ఈవీ ఉంది. రేంజ్ విషయంలో తన ప్రత్యర్థి కార్లకు తగ్గా పోటీ ఇస్తోంది. 44.5 కిలోవాట్ల బ్యాటరీతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారుగా 419 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ధర రూ. 20.99 లక్షలుగా ఉంది. కేవలం 8.5 సెకన్లతో 100 కిలోమీటర్లను అందుకోనుంది ఎంజీ జెడ్ ఎస్ ఈవీ.

హ్యుందాయ్ కోనా

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలోకి హ్యుందాయ్ కంపెనీ కూడా అడుగుపెట్టింది. కోనా పేరుతో తన ఎలక్ట్రిక్ కార్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. 39.2 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన కోనా ఎలక్ట్రిక్ కారు 452 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనుంది. కేవలం 9.2 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ధర 23.79 లక్షలుగా ఉంది.