PUSHPA : దాక్షాయని ఫస్ట్ లుక్ రిలీజ్.. అహంకారంతో ఊగిపోతున్న అనసూయ

-

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హైటెక్ మూవీగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తోంది. అయితే తాజాగా… ఈ అమ్మడు రోల్ రిలీజ్ చేసింది పుష్ప యూనిట్. పుష్ప సినిమాలో అనసూయ… దాక్షాయని పాత్రలో కనిపించనుంది. ఇక దాక్షాయని ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ లుక్ లో అనసూయ.. చాలా మాసివ్ లుక్ లో కనిపించాడు. ఒళ్లంతా నగలు వేసుకుని..ఊర మాస్‌ లుక్‌ లో అనసూయ కనిపిస్తోంది.


కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది.ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన… పోస్టర్లు, టీజర్లు మరియు సాంగ్స్‌ దుమ్ము లేపుతున్నాయి. సాంగ్స్ అయితే… యూ ట్యూబ్‌ నే షేక్‌ చేస్తున్నాయి. కాగా.. ఈ సినిమా డిసెంబర్‌ 17 వ తేదీన విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news