ఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్‌కు బుద్ది రాలేదు : మంత్రి సీతక్క

-

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు చిత్తుగా ఓడించినా ఆ పార్టీకి, నేతలకు బుద్ది మాత్రం మారలేదని మంత్రి సీతక్క విమర్శించారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి శనివారం ఆమె హాజరై మాట్లాడుతూ.. గత పదేళ్లలో రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్..తమ ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నప్పటికీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

తమ ప్రభుత్వం భవిష్యత్ తరాల అభివృద్ధికి పాటుపడుతోందని చెప్పిన సీతక్క.. రైతులను ఆదుకోవాలనే ఆలోచన బీఆర్ఎస్‌కు గతంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు బోనస్ ఏనాడూ ఇవ్వలేదని,ఇప్పుడు తాము ఇస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.‘పేదలు, రైతులకు ఉపయోగపడేలా కాంగ్రెస్ పథకాలను రూపొందిస్తున్నదని చెప్పారు. ఉచిత బస్సు కూడా సరైనది కాదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి కొందరు మహిళలను ఉసిగొలుపుతున్నారన్నారు. ఇష్టం లేకపోతే బస్సులు ఎక్కవద్దు.కానీ, నిరుపేదలకు కల్పిస్తున్న ఉచిత బస్ సౌకర్యంపై తప్పుడు ప్రచారాలు చేయకండి అని హితవు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news