నేడు దేశవ్యాప్తంగా యువతీ యువకులు డ్రగ్స్ కు బానిసలై జీవితాలను మరియు కొన్ని సార్లు ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. వీటిని రూపుమాపడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఉపయోగం లేకుండా పోతోంది. తాజగా కేరళలో పోలీసు అధికారులతో నిర్వహించిన ఒక మీటింగ్ లో కేరళ పోలీస్ కమిషనర్ సేతురామన్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ మీటింగ్ లో సేతురామన్ మాట్లాడుతూ దేశంలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది.. దేనికిని ఎలాగైనా అణచివేయాలని పోలీసులకు హితోపదేశం చేశారు. ఈ సందర్భంలో ఈయన మాట్లాడుతూ పోలీసుల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసలయ్యి ప్రాణాలను కోల్పోతున్నారంటూ షాక్ ఇచ్చాడు, సేతురామన్ చెబుతూ నాతో పనిచేసే పోలీస్ కొడుకు కూడా ఇదే విధంగా డ్రగ్స్ కు బాగా బానిసగా మారి చనిపోయాడని చెప్పాడు.
మన డిపార్ట్మెంట్ లో ఉన్న చాలామంది అధికారుల పిల్లలకు డ్రగ్స్ అలవాటుందన్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. ఎలాగైనా అరికట్టాలని సూచనలు చేశాడు.