విషాదం: మాజీ మిస్టర్ ఇండియా గుండెపోటుతో హఠాన్మరణం…

ఈ మధ్యన గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య ఊహకు అందని రీతిలో పెరుగుతూ పోతోంది. ఒకప్పుడు గుండె పోటు అంటే వృద్దులకు మాత్రమే అనుకునే సమయం నుండి ఇప్పుడు యువకులు కూడా ఈ సమస్యతో చనిపోతూ ఉండడం చాలా బాధాకరం అని చెప్పాలి. తాజాగా రాజస్థాన్ కు చెందిన బాడీ బిల్డర్ ప్రేమ్ రాజ్ (42) గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఎప్పటిలాగే ఇతను రాజస్థాన్ లోని కోటాలో తన ఇంటిలో వర్క్ ఔట్స్ చేసుకుని.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వాష్ రూమ్ కు వెళ్లారు. కానీ సమయం గడుస్తున్నా ఇంతకీ రాకపోవడంతో బాత్ రూమ్ డోర్ ను బద్దలు కొట్టి చూడగానే అప్పటికే ప్రేమ్ రాజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు అక్కడ ఉన్నవారు గుర్తించారు.

ఆ తర్వాత హాస్పిటల్ కు తరలించగా డాక్టర్లు ఆయన బాత్ రూంలోనే చనిపోయినట్లు నిర్దారించారు. ప్రేమ్ రాజ్ మాజీ మిస్టర్ ఇండియా కూడా కావడం విశేషం.