టీటీడీ పాలకమండలిలో అందరూ నేరస్తూలే..ఏపీ హైకోర్టు ఆగ్రహం !

-

టీటీడీలో నేర చరితలకు బోర్డు సభ్యులుగా ఇవ్వడంపై జగన్‌ సర్కార్‌ పై ఏపీ హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరచరిత్ర ఉన్న వారిని బోర్డు సభ్యులుగా నియమించడం పై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ రోజు కూడా యదావిదిగా వాయిదా పడటంతో పిటీషనర్‌ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్‌ తీవ్ర అభ్యంతరం చేశారు.

కేసు వివరాలను ఛీఫ్ జస్టిస్‌ ధర్మాసనానికి వివరించారు అశ్వనీ కుమార్. నేరచరిత్ర ఉన్నవారికి టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేదో లబ్ది జరగటం వలనే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించిన హైకోర్ట్‌…. అశ్వనీ కుమార్‌ వాదనలలో ప్రాదమిక సాక్షాలు ఉన్నాయని మేము భావిస్తున్నామని తెలిపింది.

అందరినీ తొలగించకపోవచ్చు … కానీ కొంతమందిని మాత్రం తొలగించాల్సిందేనని.. టీటీడీ భవనం కలెక్టరేట్‌ అవసరాల కంటే మేము విధానపరమైన నిర్ణయం కావడంతో సమర్దించామని తెలిపింది. కానీ నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండకూడదని.. ఈ నెల 19వ తేదీన నేను కేసు వాదనలు వింటాను.. అదే రోజు నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మినహాయింపులు ఉండవన్న హైకోర్టు…ఏప్రిల్‌ 19వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news