తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శాసన సభలో మరో బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పై మాట్లాడారు. తెలంగాణ కోసం కృషి చేసిన వాళ్లను స్మరించుకుంటున్నామని తెలిపారు. అందుకే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నామని తెలిపారు. ఏ కులాన్ని కించపరచడం అయినా మంచి పద్దతి కాదన్నారు.
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతూ బిల్లు పెట్టారు. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని గత శాసనసభలోనే నిర్ణయించామని తెలిపారు. గత శాసనసభలో కూనమనేని కోరారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అందరూ గుర్తించాల్సిందే. రాజకీయాలు కలుషితం అయ్యాయో.. ఆలోచనలు కలుషితం అయ్యాయో తెలియదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.